భారతదేశం, మే 14 -- Virosh Record: టాలీవుడ్ సెన్సేషనల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెండితెరపైనే కాదు, డిజిటల్ ప్రపంచంలోనూ తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. తాజాగా ఈ క్రేజ్ ప్రపంచస్థాయి రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ జంట కలిసి నటించిన యాడ్లు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

ఇటీవల రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి నటించిన 'ఎయిర్ బీఎన్బీ' (Airbnb) ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాడ్ పోస్ట్‌కు ఇప్పటివరకు ఏకంగా 9.1 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ పొందిన రెండో ప్రకటనగా ఇది రికార్డు సృష్టించింది. కేవలం ఒక జోడీకి ఇంతటి స్థాయిలో ఆదరణ లభించడం డిజిటల్ మార్కెటింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

ఆశ్చర్యకరమ...