భారతదేశం, మార్చి 5 -- టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల (Virosh Wedding) వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఫిబ్రవరి 26న ఒక్కటైన ఈ జంట, బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ (Virosh Reception) ఏర్పాటు చేశారు. ఈ వేడుక ముగిసిన తర్వాత కెమెరా కళ్లకు చిక్కిన ఒక దృశ్యం ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

రిసెప్షన్ వేడుక ముగిశాక విజయ్, రష్మిక కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో అభిమానులు, ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. రష్మికకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విజయ్ తన చేతులతో ఆమెను దగ్గరకు తీసుకుని, రక్షణ కవచంలా నిలబడ్డారు.

జనం ఒత్తిడి ఆమెపై పడకుండా జాగ్రత్త పడుతూనే.. ఎటో చూస్తున్న ఒక ఫోటోగ్రాఫర్‌ను ఉద్దేశించి హిందీలో "ఉదర్ దేఖ్" (అటు చూడు) అంటూ కెమెరా...