భారతదేశం, ఏప్రిల్ 17 -- Virat Kohli Liz Laz: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసే ప్రతి పని ఒక సెన్సేషన్. తాజాగా అతడు ఒక జర్మన్ మోడల్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ చేయడంతో నెటిజన్లు మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. గతంలో అవనీత్ కౌర్ విషయంలో జరిగిన 'అల్గారిథమ్' గ్లిచ్‌ను గుర్తుచేస్తూ కోహ్లీని నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అద్వైత్ వైద్య ఇటీవల జర్మన్ మోడల్ లిజ్ లాజ్ (Liz Laz) కి సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లైట్ బ్లూ కలర్ డ్రెస్ ధరించి, గోల్డెన్ అవర్ వెలుతురులో మెరిసిపోతున్న ఆమె ఫోటోలకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం నెటిజన్ల కంటపడింది. అంతే అప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియని లిజ్ లాజ్ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఫోటోగ్రాఫర్ అద్వైత్ ఈ విషయాన్ని స్క్రీన్‌షాట్...