భారతదేశం, ఏప్రిల్ 7 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురందర్ 2) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సినిమాను చూసి సోషల్ మీడియాలో తన రివ్యూ పంచుకున్నాడు.

ధురంధర్ 2 మూవీ తనకు ఒక అద్భుతమైన "సినీ అనుభూతిని" ఇచ్చిందని విరాట్ కోహ్లి తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ విరాట్ కోహ్లి తన రివ్యూను పోస్టు చేశాడు.

"ధురంధర్ 2 చూశా. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి అనుభవం నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పగలను. సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నా, ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయలేకపోయా. ఈ...