భారతదేశం, మార్చి 29 -- ఐపీఎల్ 2026 సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియణ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. శనివారం (మార్చి 28) రాత్రి చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

37 ఏళ్ల వయసులోనూ కోహ్లి తన పవర్ ఏంటో మరోసారి చూపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కేవలం 38 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 5 అద్భుతమైన బౌండరీలు ఉన్నాయి. కేవలం 33 బంతుల్లోనే తన 64వ ఐపీఎల్ అర్ధశతకాన్ని పూర్తి చేసి కోహ్లి చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి పేరు మీదే ఉంది. ఈ స్టార్ ప్లేయర్ 64 అర్ధశతకాలతో టాప్ లో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (62) సెకండ్ ప్లేస్ లో ఉన్...