భారతదేశం, మార్చి 11 -- స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి యాక్షన్ కు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్ 2026 కోసం ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ట్రైనింగ్ రీల్ వైరల్ గా మారింది.

ఐపీఎల్ 2026కు సమయం ఆసన్నమవుతోంది. మార్చి 28న ఐపీఎల్ 19వ సీజన్ స్టార్ట్ కానుంది. ఈ కొత్త సీజన్ కోసం విరాట్ కోహ్లి రెడీ అవుతున్నాడు. ఆర్సీబీ టీమ్ ప్రధాన ఆటగాడైన కోహ్లి ప్రాక్టీస్ ను తీవ్రతరం చేశాడు. తన వెరిఫైడ్ అకౌంట్ నుంచి కోహ్లి ఓ వీడియో పోస్టు చేశాడు. దీనికి 'ఐపీఎల్ 2026' అనే క్యాప్షన్ ఇచ్చాడు.

కొత్త ఐపీఎల్ సీజన్‌కు ముందు ఇండోర్ నెట్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తూ కోహ్లి కనిపించాడు. కోహ్లి పూర్తి బ్యాటింగ్ గేర్‌లో డ్రిల్స్ చేస్తూ, షాడో ప్రాక్...