భారతదేశం, జూన్ 28 -- Kalyanam Kamaneeyam Jeevitham Movie First Look Released: వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా కళ్యాణం కమనీయం జీవితం. ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా కళ్యాణం కమనీయం జీవితం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కళ్యాణం కమనీయం జీవితం చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "టైటిల్ చాలా బాగుంది. రాజవం...