భారతదేశం, జూన్ 19 -- Vijayawada Gade Sai Krishna Missing Case : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన యువకుడి అదృశ్యం ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన నాగరాజుపై పోలీసులు శుక్రవారం హత్య కేసు నమోదు చేశారు. గాదె సాయికృష్ణ (23) అనే యువకుడిని పోలీస్ కస్టడీలో దారుణంగా హింసించి.. చంపేశారంటూ బాధితుడి తల్లి ఆరోపించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి (53) గురువారం సాయంత్రం ఇన్‌స్పెక్టర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా.. పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. "నిన్న సాయంత్రం (గురువారం) నా సోదరి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు," అని సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ పిటిఐ వార్తా సంస్థకు వివరి...