భారతదేశం, సెప్టెంబర్ 5 -- Vijayawada Airport New Terminal : రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే సరికొత్త రూపుదిద్దుకోనుంది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ అందుబాటులోకి వస్తే, విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు సెక్యూరిటీ, బ్యాగేజ్ చెకిన్ ప్రక్రియలు మరింత సులభతరం కానున్నాయి.

ఇందుకు సంబంధించిన వివరాలను ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కొత్త టెర్మినల్ ద్వారా 'హబ్ అండ్ స్పోక్' మోడల్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొని ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పనులపై కీలక వివరాలు పంచుకున్నారు.

ఎయిర్‌ప...