భారతదేశం, సెప్టెంబర్ 27 -- విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.విజయవాడ నగరంలో ఎన్టీఆర్ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. సెప్టెంబర్ 30న లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముహూర్తం ఖరారు చేశారు.

'పేదలకు పట్టాభిషేకం' పేరిట చేపట్టే ఈ భారీ కార్యక్రమంలో 24,057 కుటుంబాలకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కల్పించనున్నారు.రూ.9,800 కోట్ల విలువైన భూములకు విముక్తిఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ ద్వారా సుమారు రూ.9,800 కోట్ల విలువైన భూమిపై పేదలకు సంపూర్ణ హక్కులు లభిస్తాయని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.

బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే.. ఈ స్థలాల విలువ దాదాపు రూ.24,297 కోట్లు ఉంటుందని అంచనా. ఈ...