భారతదేశం, మే 4 -- Vijay Trisha: తమిళనాడులో విజిల్ మోత మోగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టార్ హీరో దళపతి విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం కొనసాగిస్తోంది. ప్రస్తుతం 116 స్థానాల్లో ఉన్న టీవీకే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి హీరోయిన్ త్రిష వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

తమిళనాడు 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ పేరు ఎంతలా మార్మోగిందో, హీరోయిన్ త్రిష పేరు కూడా అంతలా వినిపించింది. విజయ్, త్రిష మధ్య అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు కలకలం రేపాయి. వీళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ఇంటికి త్రిష వెళ్లడం వైరల్ గా మారింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాలు వెలువడుతున్న ఈ రోజే (మే 4) త్రిష పుట్టిన రోజు కావడం గమనార్హం. సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న త్రిష.. మధ్...