భారతదేశం, ఆగస్టు 12 -- Vijay Sethupathi Atlee: 'నడువుల కొంజం పక్కత కాణోమ్', 'సీతాకాతి' వంటి కల్ట్ అండ్ సంచలన చిత్రాల తర్వాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), దర్శకుడు బాలాజీ తరణీధరన్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న మూడో చిత్రానికి 'బత్తా' (Baththaa) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు.

సౌత్ తో పాటు బాలీవుడ్‌లో వరుస హిట్లు కొడుతున్న స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) ఈ బత్తా చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. తన స్వంత బ్యానర్ 'ఏ ఫర్ యాపిల్ ప్రొడక్షన్స్' (A For Apple Production) తో పాటు ప్రియా అట్లీ, మురాద్ ఖేతానీ, ఆలోక్ జైన్, అజిత్ అంధారేలతో కలిసి అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అంతే కాకుండా విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న బత్తాకు బాలీవుడ్ ...