భారతదేశం, నవంబర్ 22 -- Thalapathy Vijay Sangeetha In Anirudh Kavya Reception: తమిళ సినీ, రాజకీయ రంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన వేడుకల్లో ఒకటిగా నిలిచిన అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో శనివారం (నవంబర్ 21) అట్టహాసంగా జరిగింది.

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వరకు అగ్ర తారలు, రాజకీయ ప్రముఖులు ఈ విందుకు తరలివచ్చారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టి సీఎం విజయ్, ఆయన భార్య సంగీతలపైనే నిలిచింది. ఒకే కార్యక్రమానికి హాజరైనప్పటికీ, వీరిద్దరూ విడివిడిగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చెన్నై వేదికగా జరిగిన ఈ రిసెప్షన్‌లో దళపతి విజయ్ భార్య సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్ న్యూస్ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్న వీడియోలో సంగీత ఎంతో ఉత్సాహంగా, చిరునవ్వుతో క...