భారతదేశం, ఏప్రిల్ 12 -- Vijay Rashmika: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా, సన్నిహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగిన గ్రాండ్ పార్టీలో రష్మిక మందన్న చేసిన రచ్చ గురించి సెలబ్రిటీ డీజే గణేష్ తాజాగా వెల్లడించాడు.

ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీజే గణేష్ మాట్లాడుతూ.. రష్మిక మందన్నకు బాలీవుడ్ పాటలంటే ఎంత ఇష్టమో వివరించాడు. "నిజానికి ఇది సౌత్ ఇండియన్ వెడ్డింగ్ కాబట్టి నేను వేరే రకమైన మ్యూజిక్ అనుకున్నా. కానీ రష్మికకు హిందీ పాటలంటే విపరీతమైన క్రేజ్. అందుకే నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

రష్మిక తన ఫేవరెట్ సాంగ్ 'సామీ సామీ'తో పాటు సల్మాన్ ఖాన...