భారతదేశం, మార్చి 2 -- టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న ఈ జంట.. సోమవారం (మార్చి 2) తమ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. తెలంగాణలోని తుమ్మనపేటలో వారు నిర్మించుకున్న కొత్త ఇంట్లో అత్యంత వైభవంగా 'గృహప్రవేశం', 'సత్యనారాయణ వ్రతం' నిర్వహించారు.

తమ అభిమాన జంట కొత్త ఇంట్లోకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వందలాది మంది అభిమానులు తుమ్మనపేటకు చేరుకున్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం విజయ్, రష్మికలు బయటకు వచ్చి అభిమానులను పలకరించారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ తన అర్ధాంగి రష్మిక చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకురాగా, ఆమె అభిమానులకు అభివాదం చేస్తూ కృతజ్ఞ...