భారతదేశం, మార్చి 10 -- ఏడేళ్ల ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి సెలబ్రేషన్స్ కు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన వీరి వివాహానికి ముందు నిర్వహించిన 'ప్రధానం', 'మెహందీ' వేడుకల ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకల్లో 'విరోష్' (Virosh) జోడీ సందడి చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

గత నెల అంటే ఫిబ్రవరి 25న జరిగిన ఈ వేడుకల్లో విజయ్, రష్మికలు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. షేర్ చేసిన ఫోటోల్లో ఈ జంట కలిసి డ్యాన్స్ చేస్తూ, నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఒక ఫోటోలో రష్మిక నుదుటిపై విజయ్ ముద్దు పెడుతున్న సీన్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ వేడుక కోసం రష్మిక ప్రత...