భారతదేశం, ఏప్రిల్ 5 -- రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. రణబాలి మూవీలో రష్మిక మేకోవర్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. సినిమా కోసం ఆమె తన లుక్ ను మార్చుకునే మేకింగ్ వీడియో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇవాళ (ఏప్రిల్ 5) రష్మిక మందన్న బర్త్ డే. ఈ సందర్భంగా తన భార్యపై విజయ్ దేవరకొండ ప్రేమ కురిపించేశాడు. ''ఐ లవ్యూ జయమ్మ'' అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రణబాలి మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.

రణబాలి మూవీలో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇందులో 'జయమ్మ' అనే క్యారెక్టర్లో రష్మిక నటిస్తోంది. కథానాయకుడి భార్య క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ పేరును మెన్షన్ చేస్తూ రణబాలి కోసం రష్మ...