భారతదేశం, నవంబర్ 15 -- Vijay Deverakonda Rashmika Mandanna Japan Vacation Photos: టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కేంద్రబిందువుగా నిలిచారు. ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్ వేదికగా ఎంతో వైభవంగా పెళ్లి పీటలెక్కిన ఈ జంట, ఇటీవల 'కాఫీ విత్ కరణ్' ఓటీటీ షోలో పాల్గొని విమర్శల పాలైంది.

అయితే ఆ వివాదాలన్నింటికీ తెరదించుతూ విజయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జపాన్ పర్యటనకు సంబంధించిన అందమైన ఫోటోలను పంచుకున్నారు. తద్వారా తమ బంధంపై వస్తున్న పుకార్లకు, ట్రోలింగ్‌కు తనదైన శైలిలో చెక్ పెట్టారు.

వివాదాల వేడి తగ్గిన కొద్ది రోజులకే విజయ్ తన తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండ, సతీమణి రష్మికతో కలిసి జపాన్ విహారయాత్రకు వెళ్లారు విజయ్ దేవరకొండ. అక్కడ కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా గడుపుతున్న ఫ...