భారతదేశం, జూన్ 14 -- Vijay Deverakonda Rashmika Mandanna Scholarship To 180 Students Today: వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తాము రియల్ హీరోలమని టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిరూపించుకున్నారు. ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన ఈ జంట కేవలం విలాసవంతమైన జీవితానికే పరిమితం కాకుండా, సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.

గతంలో తమ ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న శుభ సందర్భంలో ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ నేడు (జూన్ 14) విజయ్ దేవరకొండ తన తండ్రి జన్మస్థలమైన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేట గ్రామానికి రష్మికతో కలిసి వెళ్లారు.

పెళ్లి తర్వాత మొదటిసారిగా తమ సొంతూరికి వచ్చిన ఈ కొత్త దంపతులకు గ్రామస్థులు ఘనస్వాగతం ప...