భారతదేశం, మే 8 -- Vijay Marks Sheet: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైన 'దళపతి' విజయ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఆయన నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత సక్సెస్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే విద్యార్థిగా విజయ్ ప్రస్థానం ఎలా సాగింది? ఆయనకు పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? అనే వివరాలు వెల్లడిస్తూ ఒక మార్క్ షీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న మార్కుల జాబితా ప్రకారం.. విజయ్ పదో తరగతిలో సగటున 65% మార్కులు సాధించారు. అయితే ఆయనకు గణితం (Mathematics) అంటే కొంచెం కష్టమని ఈ మార్కులను చూస్తుంటే అర్థమవుతోంది. మ్యాథ్స్‌లో 200 మార్కులకు గానూ విజయ్ కేవలం 95 మార్కులు మాత్రమే సాధించారు. ఇది ఆయన స్కోర్ చేసిన సబ్జెక్టులన్నింటిలోనూ అత్యల్పం కావడం గమనార్హం.

లెక్కల్లో కాస్త వెనుకబడినప్పటికీ, విజయ్ తన మాతృభా...