భారతదేశం, అక్టోబర్ 6 -- Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్‌గా చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన 'ఐఫోన్ 18 ప్రో' (iPhone 18 Pro) కొనకుండా, ఇప్పటికీ పాత ఐఫోన్ మోడల్‌నే వాడుతున్నట్లు విజయ్ రివీల్ చేశారు. కేవలం ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం ఈఎంఐలు (EMIs) పెట్టి మరీ కొత్త ఫోన్లు కొనే ట్రెండ్‌పై ఆయన స్పందిస్తూ యూత్‌కు గట్టి మెసేజ్ ఇచ్చారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఫోన్ల టెక్నాలజీ పిచ్చిపై ఓపెన్‌గా మాట్లాడారు. మార్కెట్‌లో ప్రతీ ఏటా కొత్త ఆపిల్ మోడల్స్ వస్తూనే ఉంటాయని, అయితే పాత ఫోన్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నప్పుడు లక్షలు పోసి కొత్తది కొనాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ప...