భారతదేశం, అక్టోబర్ 8 -- Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనపై వస్తున్న డిజిటల్ నెగెటివిటీపై, ఆన్‌లైన్ పేయిడ్ ట్రోల్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన తన లేటెస్ట్ పీరియాడిక్ మాస్ ఎపిక్ 'రణబాలి' (Ranabaali) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన విజయ్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' (Jailer 2) సినిమాతో వస్తున్న బాక్సాఫీస్ క్లాష్‌పై, సోషల్ మీడియాలో జరుగుతున్న పేయిడ్ ప్రచారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆన్‌లైన్‌లో తనపై వస్తున్న హేట్ కామెంట్స్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు విజయ్ చాలా ఇంటెన్స్‌గా స్పందించారు. "నా కలలు, నా కష్టం అనవసరం అని ఎవరో అనుకున్నంత మాత్రాన నేను ఆపేయాలా? నా నిజాయితీని పొగరు అని భావిస్తే నేను నటించడం స్టార్ట్ చేయాలా? నా కాన్ఫిడెన్స్‌ను బలుపు అనుకుంటే నేను వెనక్కి తగ్గాలా? నా ...