భారతదేశం, ఆగస్టు 31 -- Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పీచ్ మరోసారి వైరల్ గా మారింది. రణబాలి, రౌడీ జనార్ధన్ మూవీ షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈ రౌడీ హీరో.. చాలా కాలం తర్వాత బయట కనిపించాడు. సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్న రోమాంచకం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు విజయ్.

రోమాంచకం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. తనదైన స్టైల్లో స్పీచ్ తో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే యాంకర్.. 2026లో రోమాంచకం (గూస్ బంప్స్) మూమెంట్ ఏది అని అడిగింది. ఈ ప్రశ్నకు విజయ్ ఇచ్చిన సమాధానం తెగ వైరల్ గా మారింది.

''89 (1989)లో పుట్టినా. అప్పటి నుంచి రోమాంచకమే అసలు. 89 నుంచి ప్రతి ఇయర్ అలాగే. పాకెట్ లో డబ్బులు ఉన్నా లేకపోయినా మందు తాగినా. ఆ తర్వాత మందు వదిలేసినా. ప్రేమలో పడ్డా. హార్ట్ బ్రేక్ అయింద...