భారతదేశం, మే 16 -- Vijay Devarakonda: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ ఫాంటసీ కోర్ట్ రూమ్ డ్రామా 'వీరభద్రుడు'. తమిళంలో 'కరుప్పు' పేరుతో విడుదలైన ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు కొన్ని ఆర్థికపరమైన చిక్కుల వల్ల ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చినప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.

ముఖ్యంగా కరుప్పులో సూర్య నటనకు, చిత్ర కథాంశానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లన్నీ ప్రేక్షకుల ఈలలు, గోలలతో మార్మోగిపోతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ వీరభద్రుడు చిత్రంపై, హీరో సూర్యపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.

తమిళంలో 'కరుప్పు'గా, తెలుగులో 'వీరభద్రుడు'గా రిలీజైన సినిమాకు ప్రే...