భారతదేశం, మే 9 -- Vijay Devarakonda: పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి 'రణబాలి'లా వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరో నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ఇది. ఇవాళ (మే 9) విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రణబాలి మూవీ టీమ్ బీటీఎస్ వీడియో షేర్ చేసింది. ఇందులో గుర్రాన్ని తోలడం కోసం విజయ్ ఎంతలా కష్టపడ్డాడో చూపించారు.

విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ చెప్తూ రణబాలి మూవీ టీమ్ రిలీజ్ చేసిన బీటీఎస్ వీడియో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ''మా స్టాలియన్ (మేలు జాతి గుర్రం) విజయ్ దేవరకొండకు హ్యాపీ బర్త్ డే. పీక్ సినిమాలో పీక్ విజయ్ దేవరకొండను చూసేందుకు రెడీ అవండి. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది'' అని రణబాలి టీమ్ ఓ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది.

విజయ్ కష్టం

రణబాలి సినిమాలో గుర్రంపై వచ్చే వీరుడిలా విజయ్ దేవరకొండ ...