Vijay Antony: కూతురు చనిపోయినప్పటి నుంచీ చెప్పులు వేసుకోవడం మానేసిన స్టార్ హీరో.. ఆమె వాచే పెట్టుకుంటూ.. భార్య ఎమోషనల్
భారతదేశం, నవంబర్ 20 -- Vijay Antony: 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన ప్రముఖ తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ బయటకు ఎంతో ప్రశాంతంగా, నిబ్బరంగా కనిపిస్తుంటారు. కానీ ఆయన మనసు లోపల దాగి ఉన్న తండ్రి గుండెకోత ఎంత లోతైనదో ఆయన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ తాజాగా ప్రపంచానికి తెలియజేశారు.
2023 సెప్టెంబర్‌లో తమ 16 ఏళ్ల పెద్ద కుమార్తె మీరా ఆకస్మిక మరణం తర్వాత, విజయ్ ఆంటోనీ జీవితం పూర్తిగా మారిపోయిందని ఆమె వెల్లడించారు. నవంబర్ 20న విడుదలైన తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామా 'అప్ప కుట్టి' (Appa Kutty) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.
మూడేళ్ల క్రితం కూతురు మీరా మరణించిన తర్వాత ఫాతిమా తొలిసారిగా ఒక సినిమా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్త పడుతున్న మౌన వేదనను ఆమె వివరించారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.