భారతదేశం, మే 18 -- Vijay: తమిళ చిత్రసీమలో తిరుగులేని 'దళపతి'గా వెలిగిన జోసెఫ్ విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సాధించిన ఈ విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. సినిమాల్లో పొలిటికల్ పంచ్‌లు విసరడం, సామాజిక అన్యాయాలపై పోరాటాలు చేయడం ద్వారా ఆయన ప్రజా హృదయాల్లో బలమైన స్థానం సంపాదించుకున్నారు.

ఆయన రాజకీయ విజయాన్ని 2024లో వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ది గోట్) సినిమా ముందే ఊహించిందని చెప్పవచ్చు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు.. ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి ఒక అద్భుతమైన బహుమతిని అందించారు.

సోమవారం (మే 18) నాడు ముఖ్యమంత్రి విజయ్‌ని దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత, 'ది గోట్' సినిమాలో ఆయన విజయాన...