భారతదేశం, మార్చి 9 -- తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సుమారు 25 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం చెన్నై కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

విజయ్ తన కోస్టార్ (నటి) తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని సంగీత తన పిటిషన్‌లో ఆరోపించిన నేపథ్యంలో హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సామాజిక విమర్శల మధ్య బాలీవుడ్ దర్శక దిగ్గజం విక్రమ్ భట్ ఈ జంటకు మద్దతుగా నిలిచారు.

సోమవారం (మార్చి 9) తన ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్టర్ విక్రమ్ భట్ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు. విజయ్-త్రిషల వ్యక్తిగత స్వేచ్ఛ గురించి గట్టిగా మాట్లాడారు. "ఆన్‌లైన్‌లో వస్తున్న పుకార్లు నిజమో కాదో నాకు తెలియదు. కానీ, ఒకవేళ అవి నిజమైతే, నేను కొన్ని విషయాలు చెప్పక తప్పద...