భారతదేశం, జూలై 11 -- Vietnam Boat Capsize : వియత్నాంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్‌బోట్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో భారతీయ పర్యాటకులతో సహా కనీసం 15 మంది మరణించినట్లు స్థానిక వియత్నాం మీడియా వెల్లడించింది.

స్థానిక న్యూస్ పోర్టల్ 'వీఎన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్నేషనల్' తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాద సమయంలో స్పీడ్‌బోట్‌లో 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా హాన్ మే రుట్ నుంచి అన్ థోయ్ పోర్టుకు ప్రయాణిస్తుండగా... హాన్ మే రుట్ న్గోయ్ తీరానికి దాదాపు 400 మీటర్ల దూరంలో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే పడవలో ఉన్న వారంతా ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే ఫు క్వాక్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అధికారులు...