భారతదేశం, ఆగస్టు 31 -- Veta 2026 Movie Launch Puja Ceremony: ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ ఓటీటీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'వేట'. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్‌తో వస్తున్న ఈ మూవీలో సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ఈ వేట సినిమా పూజా కార్యక్రమాలకు మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, డైరెక్టర్స్ కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ ప...