భారతదేశం, జూలై 30 -- Venky Atluri: పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' సీక్వెల్ 'కల్కి 2' తో పాటు ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న 'స్పిరిట్' ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ తప్పుకోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. సౌత్ ఇండియన్ సినిమా వర్కింగ్ కండిషన్స్, సుదీర్ఘమైన షూటింగ్ అవర్స్‌కు అడ్జస్ట్ కాలేకపోవడం వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్‌ల నుంచి బయటకు వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వివాదంపై తాజాగా సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి స్పందించారు. బాలీవుడ్ నటీనటులు సౌత్ కల్చర్‌కు, వర్కింగ్ స్టాండర్డ్స్‌కు అలవాటు పడాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

తన కొత్త సినిమా విశ్వనాథ్ అండ్ సన్...