భారతదేశం, ఆగస్టు 31 -- Veligonda Project Phase 1 Inauguration : ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల ముప్పై ఏళ్ల దశాబ్దాల కల నెరవేరింది. ప్రతిష్టాత్మకమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కృష్ణా జలాలు తమ ప్రాంతానికి చేరుకోవడంతో మార్కాపురం ప్రాంత ప్రజలు, నిరుపేద రైతాంగం తీవ్ర ఆనందోత్సాహాలకు లోనయ్యారు. నీటి ప్రవాహాన్ని చూసి స్థానికులు పులకించిపోయారు.

దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు స్వయంగా నీటిలోకి దిగి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు (చీర) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లమల కొండల్లో నిర్మించిన రెండు భారీ సొరంగాల గుండా వచ్చిన కృష్ణా జలాలు గంటవానిపల్లి ఆక్విడెక్టుకు చేరుక...