భారతదేశం, సెప్టెంబర్ 24 -- Veerabhadrudu Tv Premier: తమిళ స్టార్ సూర్య ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే అంతకంటే ముందు 'కరుప్పు' మూవీతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు సూర్య. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ కరుప్పు మూవీ తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో రిలీజైంది.

కోలీవుడ్​ స్టార్​ సూర్య, త్రిష కృష్ణన్ జంటగా నటించిన'వీరభద్రుడు' సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ ఆదివారం,సెప్టెంబర్ 27న సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ జీ తెలుగులో ప్రసారం కానుంది. తమిళంలో 'కరుప్పు' పేరుతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్​ వేదికగా తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది.

తమిళంలో కరుప్పుగా రిలీజైన సూర్య సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులో వీరభద్రుడిగా వచ్చి సత్తాచాటింది. మే...