భారతదేశం, ఆగస్టు 10 -- Varuna Yagam Nagarjuna Sagar : నైరుతి రుతుపవనాల కాలం సగానికి పైగా పూర్తయి, ఆగస్టు రెండో వారంలోకి ప్రవేశించినప్పటికీ తెలంగాణలోని ప్రధాన జలాశయాలు ఇంకా ఆశించిన స్థాయిలో భర్తీ కాలేదు. రాష్ట్రానికి ఆధారమైన కృష్ణ, గోదావరి నదుల్లోకి ఎగువ నుంచి తగినంత నీటి ప్రవాహాలు రాకపోవడంతో సాగు, తాగునీటి వ్యవస్థలపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, జలాశయాలు జలకళతో నిండాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా 'వరుణయాగం' నిర్వహించాలని నిర్ణయించింది.

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంగణంలో ఈ వేద క్రతువును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి సంబంధించి ఏర్పాటు చేసిన 'పూర్ణాహుతి' కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వ...