భారతదేశం, సెప్టెంబర్ 10 -- Varun Tej Son: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ ముద్దుల కుమారుడు వాయువ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు దాచి ఉంచిన తమ చిన్నారి ముఖాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా రివీల్ చేశారు. ఈ క్యూట్ స్నాప్స్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

తమ కొడుకు ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో ఓ స్పెషల్ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. "మై డియర్ బాయ్.. నువ్వు నా ప్రపంచాన్ని ఎంతో అందంగా మార్చేశావు. నిన్ను మొదటిసారి కళ్లతో చూడకముందే నీ ప్రేమలో పడిపోయాను. నీకు తండ్రిగా మారడమే నా లైఫ్‌లో బెస్ట్ పార్ట్. హ్యాపీ ఫస్ట్ బర్త్‌డే వాయువ్.. ఎప్పటికీ ఐ లవ్ యు" అంటూ కొడుకుపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు.

పోస్ట్...