భారతదేశం, మార్చి 28 -- టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. చెల్లి నిహారిక కొణిదెల ప్రొడక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. వాలీబాల్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా పేరు 'బరి'. ఈ రోజు (మార్చి 28) ఈ సినిమా షూటింగ్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. దీనికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు.

బరి సినిమా షూటింగ్ లాంఛ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ గెస్ట్ గా రావడంపై వరుణ్ తేజ్ సంతోషం వ్యక్తం చేశాడు. బాబాయ్ రావడం కిక్కు అని పేర్కొన్నాడు. ''ఈ సినిమా చాలా స్పెషల్. నిహా (నిహారిక)తో కొలబరేట్ కావడం ఎంతో స్పెషల్. అలాగే యంగ్ డైరెక్టర్ యధు వంశీతో మూవీ చేయడం ఇంకా స్పెషల్. కమిటీ కుర్రాళ్లు చూసినప్పటి నుంచి డైరెక్టర్ ను అడ్మైర్ చేస్తున్నా'' అని వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.

''కథ విన్నప్పటి నుంచి ఈ సినిమా అం...