భారతదేశం, అక్టోబర్ 5 -- Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' (Varanasi). ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి దిగ్గజ సినిమాల తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడం వల్ల 'వారణాసి'లోని యాక్షన్ బ్లాక్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ వేరే రేంజ్ లో ఉంటాయన్నారు.

"వారణాసి సినిమాలో ఉండే యాక్షన్ సన్నివేశాలు చాలా క్రేజీగా ఉంటాయి. మీరు గతంలో ఆర్‌ఆర్‌ఆర్ లేదా బాహుబలి సినిమాల్లో చూసిన తరహ...