భారతదేశం, ఆగస్టు 3 -- Varanasi: ఇండియన్ సినిమా దశ దిశ మార్చేసిన దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి' నుంచి ఊహించని క్రేజీ లీక్ బయటకొచ్చింది. ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్‌లో 'టైమ్ ట్రావెల్' కాన్సెప్ట్‌తో పాటు ప్రాచీన రోమ్, అంటార్కిటికా బ్యాక్‌డ్రాప్ ఉండబోతోందని రాజమౌళి స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు రాజమౌళి పూనకాలు తెప్పించారు.

ఇటీవల సౌనామి (Tsounami)కి ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో రాజమౌళి వారణాసి సినిమా కథాంశం, విజువల్ స్కేల్ గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ప్రయాణం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో ప్రారంభమై అంటార్కిటికా, ఆఫ్రికా అడవుల గుండా సాగుతుందని వెల్లడించార...