భారతదేశం, మార్చి 8 -- వరలక్ష్మి శరత్ కుమార్ కు కోపమొచ్చింది. పాపులర్ స్టోరీ రైటర్ సాయి మాధవ్ బుర్రాపై ఆమె ఫైర్ అయింది. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల 'ఎస్. సరస్వతి' చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమెతో పాటు ప్రకాష్ రాజ్, ప్రియమణి, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఎస్.సరస్వతి సినిమాకు ముందు పాపులర్ రైటర్ సాయి మాధవ్ బుర్రా స్టోరీ అందించాడు. కానీ ఈ స్టోరీ నచ్చకపోవడంతో వరలక్ష్మి దీన్ని మార్చింది. స్టోరీ మార్చడంపై సాయి మాధవ్ బుర్రా అసహనం వ్యక్తం చేశాడు. తీవ్రమైన మాటలు జారాడనే విమర్శలు వస్తున్నాయి.

"ఇది నా కథతో మొదలై మరో కథతో ముగుస్తుంది. ఒక్క మాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు.. కథని మానభంగం చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు.. నా సోల్ వేరు.. అసలా కథే వేరు'' అని ఓ ఫేస్ బుక్ పోస్టులో సాయి మాధవ్ బుర్రా పేర్క...