భారతదేశం, జూన్ 18 -- భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో వందే భారత్ రైళ్లు సరికొత్త విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు చైర్ కార్ (కూర్చుని ప్రయాణించే) సదుపాయంతోనే సేవలందించిన ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో.. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వందే భారత్ స్లీపర్' కోచ్‌లు కూడా పట్టాలెక్కాయి. ఈ సరికొత్త ప్రీమియం స్లీపర్ క్లాస్‌లో ప్రయాణ అనుభవం ఎలా ఉంటుంది? లోపల ఎలాంటి అత్యాధునిక వసతులు కల్పించారు? అనే విషయాలను సోషల్ మీడియాలో 'మంకీ మ్యాజిక్' పేరుతో పాపులర్ అయిన కంటెంట్ క్రియేటర్ రౌనక్ సాహ్ని తన తాజా వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

నిజానికి రౌనక్ సాహ్ని ఇటీవల ఒక వినూత్నమైన ఛాలెంజ్‌ను స్వీకరించారు. భారతీయ రైల్వేలోనే వరుసగా 14 రోజుల పాటు గడపడం ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. ఈ ఛాలెంజ్ నిబంధనల ప్రకారం.. ఆయన రైలు దిగి ఏ స్టేషన్ ఆవరణ దాటి బయటకు వెళ్లకూడదు...