భారతదేశం, ఏప్రిల్ 7 -- మన ఇండియా ఒకవైపు టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొందరి నిర్లక్ష్యం వల్ల మన దేశం వందల ఏళ్ల వెనక్కి వెళ్లిపోతోంది! ఇందుకు ఉదాహరణగా తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్-ముంబై వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ముంబై వాసికి వడ్డించిన భోజనం (దాల్​-చావల్)లో బొద్దింక కనిపించింది. సదరు ప్రయాణికుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్​' (గతంలో ట్విట్టర్) వేదికగా వీడియో, ఫోటోలతో పాటు వెల్లడించడంతో అది వైరల్‌గా మారింది.

దీనిపై తక్షణమే స్పందించిన ఐఆర్‌సీటీసీ.. సదరు వెండర్‌పై రూ. 10 లక్షల జరిమానా విధించడమే కాకుండా కాంట్రాక్ట్ రద్దు నోటీసు జారీ చేసింది.

తన కోచ్‌లో కనీసం ఇలాంటివి రెండు కేసులు నమోదయ్యాయని, అది చూసిన తర్వాత ఎవరూ భోజనం చేయలేకపోయారని సదరు ప్రయాణికుడు 'ఎక్స్​'లో ప...