భారతదేశం, జూన్ 6 -- Vaibhav Sooryavanshi Team India: భారత క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని ఒక సంచలనం నమోదైంది. ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్ విధ్వంసంతో దేశాన్ని ఊపేసిన 15 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అధికారికంగా భారత సీనియర్ టి20 జట్టులోకి ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు రానున్న ఏషియన్ గేమ్స్ స్క్వాడ్‌లో సెలక్టర్లు అతనికి చోటు కల్పించారు.

1989లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల వయసులో) నెలకొల్పిన అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రికెటర్ రికార్డును వైభవ్ సూర్యవంశీ తుడిచిపెట్టాడు. ఇండియా టీమ్ కు సెలెక్ట్ అయిన యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు.

అయితే, కేవలం ఐపీఎల్ ఫామ్ చూసే సెలక్టర్లు ఇంత చిన్న వయసులోనే అతడిని సీనియర్ జట్టులోకి తీసుకున్నారా? ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు, టెక్నికల్ లెక్కలు ఏంటో ఇక్కడ విశ్లేష...