భారతదేశం, ఏప్రిల్ 27 -- Vaibhav Sooryavanshi Accused Of Using AI Chip In Bat: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అగ్రశ్రేణి బౌలర్లను చీల్చిచెండాడుతున్న ఈ కుర్రాడి ఆటతీరుపై పాకిస్థాన్ క్రికెట్ నిపుణుడు నౌమన్ నియాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

'స్మాష్ హిట్' అనే కార్యక్రమంలో నౌమన్ నియాజ్ మాట్లాడుతూ.. "ఈ పిల్లాడి (వైభవ్ సూర్యవంశీ) బ్యాట్‌ను ఒకసారి చెక్ చేయండి. వాడా (WADA) ఎలాగైతే డోప్ టెస్టులు చేస్తుందో, అలాగే ఇతడి బ్యాట్‌ను ల్యాబ్‌కు పంపాలి. బహుశా ఇతడు తన బ్యాట్‌లో ఏఐ (AI) చిప్‌ను వాడుతున్నాడేమో. 18 ఏళ్ల వయసు వస్తే తప్ప శరీరంలో కండరాలు, బలం రావు. కానీ 16 ఏళ్ల లోపు ఉన్న ఇతడు ఇంత పవర్ ఎలా జనరేట్ చేస్తున్నాడు? విరాట్ కోహ్లీ వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు పుట్టిన ఈ పిల్లాడు 360 డిగ్రీల్లో ఆడ...