భారతదేశం, మే 27 -- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 (IPL 2026) ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లకు రాజస్థాన్ రాయల్స్ (RR) 'బోయ్ వండర్' వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ముల్లన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో కేవలం 3 పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును మిస్ చేసుకుని తీవ్ర నిరాశకు గురయ్యాడు.

అయినప్పటికీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసిన ఈ 15 ఏళ్ల సంచలనం.. ముగ్గురు దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టి ఐపీఎల్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. వైభవ్ ఊచకోతతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోరు చేసింది.

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అతని నిర్ణయం తప్పని నిరూపించడానికి వైభవ్‌కు ఎంత...