భారతదేశం, ఏప్రిల్ 15 -- Vaazha 2 Telugu: డెబ్యూ డైరెక్టర్ సవిన్ ఎస్.ఎ. దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ బ్లాక్‌బస్టర్ యూత్‌ఫుల్ కామెడీ డ్రామా వాలా 2 (Vaazha 2). ఈ మూవీ కేరళలో భారీ విజయాన్ని అందుకుంది. కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్కును చేరువవుతూ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఈ మ్యాజిక్‌ను ఇప్పుడు తెలుగులోనూ పునరావృతం చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.

తాజా సమాచారం ప్రకారం మలయాళం కామెడీ డ్రామా 'వాలా 2' తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 24, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది. సాధారణంగా తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని వేసవి కానుకగా తెలుగులోకి తీసుకువస్తున్నారు.

ఈ వాలా 2 మూవీలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి ప్రధాన పాత్రల్లో నటి...