భారతదేశం, మార్చి 7 -- మరికొన్ని రోజుల్లోనే థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా స్టార్ట్ కాబోతుంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డబ్బింగ్ ను పవన్ కల్యాణ్ స్టార్ట్ చేస్తాడు. ఈ విషయాన్ని మూవీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో అనౌన్స్ చేశారు.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. దీనికి హరీష్ శంకర్ డైరెక్టర్. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ నటించాడు. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి పవన్ కల్యాణ్ డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. ''ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. కల్ట్ కెప్టెన...