భారతదేశం, మార్చి 4 -- హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' (Dekh Lenge Saala), 'ఆరా ఆఫ్ ఉస్తాద్' (Aura of Ustaad) వంటి సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ టీమ్ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కోసం బీజీఎంను తమన్ అందించనుండటం విశేషం. దీనికి కారణమేంటో వివరిస్తూ మేకర్స్ ఓ ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించి రీల్స్ పంపడంలో నిర్మాణ సంస్థ వైపు నుండి కొంత ఆలస్యం జరిగింది.

ఆ సమయంలో డీఎస్పీ తన ఇతర ప్రాజెక్టుల కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సినిమాకు సమయం కేటాయించలేక...