భారతదేశం, జూన్ 9 -- అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం నెలల తరబడి వేచి చూసే రోజులకు చెక్ పెట్టేందుకు యూఎస్ ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని తీసుకువచ్చింది. బి-1/బి-2 (టూరిస్ట్, బిజినెస్) వీసా దరఖాస్తుదారుల కోసం ఒక వినూత్న ప్రీమియం సేవను ప్రారంభించబోతోంది. దీని ద్వారా దరఖాస్తుదారులు అదనపు రుసుము చెల్లించి కేవలం 10 రోజుల్లోనే వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ను సొంతం చేసుకోవచ్చు.

రాబోయే జూలై 1, 2026 నుండి ఈ పైలట్ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. అర్హులైన దరఖాస్తుదారులు సాధారణ వీసా ఫీజు $185తో పాటు అదనంగా $750 చెల్లించి ఈ త్వరితగతిన (ఎక్స్‌పెడైటెడ్) ఇంటర్వ్యూ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ ఆరు నెలల పైలట్ ప్రోగ్రామ్ డిసెంబర్ 31, 2026 వరకు కొనసాగుతుంది. ఈ వ్యవధిలో వచ్చే స్పందన, కార్యాచరణ ప్రభావాలను అంచనా వేసిన తర్వాతే ద...