భారతదేశం, జూన్ 15 -- Strait of Hormuz : ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించే విధంగా ఒక సంచలన అప్‌డేట్ వచ్చింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం ముగిసిపోయినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (హర్ముజ్ జలసంధి) ని తక్షణమే పునఃప్రారంభిస్తున్నట్లు, అలాగే ఇరాన్‌పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫారమ్‌లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో కుదిరిన ఈ శాంతి ఒప్పందం ఇప్పుడు పూర్తిగా విజయవంతమైందని పే...