భారతదేశం, మార్చి 1 -- పశ్చిమాసియాపై కమ్ముకున్న యుద్ధమేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇరాన్​పై అమెరికా- ఇజ్రాయెల్​ దాడులు చేయడం, ఆ దేశ అగ్రనేత అయతొల్లా అల్​ ఖమేనీని హతమార్చడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్​ సైతం ప్రకటించింది. ఈ పరిణామం ఇరాన్ అణు వివాదంపై పాశ్చాత్య దేశాలతో జరగాల్సిన దౌత్యపరమైన పరిష్కార ఆశలను పూర్తిగా నీరుగార్చింది. ఈ యుద్ధ ప్రభావం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా, సోమవారం మార్కెట్లు ప్రారంభమైనప్పుడు ఈక్విటీలు, బంగారం, వెండి వంటి ఆస్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.

సోమవారం దలాల్ స్ట్రీట్ భారీ 'గ్యాప్-డౌన్'తో ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిఫ్టీ 50 అంచనా: నిఫ్టీ 50 ఇండెక్స్ తన సపోర్ట్​ స...